టాటా ఏస్ వాహన డ్రైవర్ నిర్లక్ష్యం 9 మంది ప్రాణాలు బలితీసుకుంది...

Webdunia
సోమవారం, 9 మే 2022 (12:14 IST)
ఓ టాటా ఏస్ డ్రైవర్ వాహనం నిర్లక్ష్యం తొమ్మిది మంది ప్రాణాలను తీసింది. నిర్లక్ష్యంతో అతివేగంగా వాహనం నడపడం వల్ల జరిగిన ప్రమాదంలో టాటా ఏస్‌లో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం తెలంగాణా రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు జిల్లాలోని పిట్లం మండలం చిల్లర్గికి చెందిన సౌదర్ పల్లి మాణిక్యం అనే వ్యక్తి గత వారం చనిపోయారు. ఆయన దశదిన కర్మ కార్యక్రమంలో ఆదివారం జరిగింది. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులంతా కలిసి టాటా ఏస్ వాహనంలో ఎల్లారెడ్డి పట్టణంలోని వారపుసంతలో అంగడిదింపుడు కార్యక్రమానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమం ముగించుకుని తిరిగి ఇంటికి బయలుదేరారు. 
 
ఈ వాహనం హసన్ పల్లి వద్ద వస్తుండగా ఎదుుగా వస్తున్న లారీని టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. అయితే, ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన లారీ డ్రైవర్ లారీని రోడ్డు కిందికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. 
 
టాటా ఏస్ డ్రైవర్ అతి వేగం కారణంగా లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏస్ వాహనం నుజ్జునుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న డ్రైవర్ సాయిలు (25), లచ్చవ్వ (45)లు అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. 
 
వీరిలో ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగా, ఐదుగురు చికిత్స పొందుతూ మొత్తంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోద చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments