రెబల్ స్టార్ ప్రభాస్‌తో `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది, దీనికోసం ఓ భారీ సెట్‌ను వేశారు. అమితాభ్ ప్రముఖ పారిశ్రామికవేత్త అశ్వథ్థామగా కనిపిస్తుండగా, దీపికా పదుకొణె ఉద్యోగినిగా నటిస్తోంది. ప్రభాస్ ఇందులో అమితాభ్ తనయుడి పాత్రలో నటిస్తున్నాడు. కాగా, ఇప్పుడు మరో భామ ఈ సినిమాలో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. దిశా పటానీ ఇందులో నటించబోతోంది.
ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోలతో నెటిజన్లను ఆకట్టుకునే ఈ భామ తనకు తనకు వైజయంతీ మూవీస్ నుంచి వచ్చిన గిఫ్ట్ ఫోటోను షేర్ చేసింది. ప్రాజెక్ట్ కే సినిమాలో భాగమైన నిన్ను చిత్రబృందం సాదరంగా ఆహ్వానిస్తోంది. నువ్వు ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం త్రిల్లింగ్‌గా ఉంది అని రాసిన విషయాన్ని ప్రస్తావించింది. మరి ఇందులో ఆమె ఎటువంటి పాత్ర పోషిస్తుందో త్వరలో చిత్ర యూనిట్ ప్రకటించనుంది. ఎవడే సుబ్రమణ్యం, మహానటి సినిమాతో నాగ్ అశ్విన్ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాకు రెండు పాటలను దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు.