Publish Date: Sat, 30 Apr 2022 (15:59 IST)
Updated Date: Sat, 30 Apr 2022 (16:03 IST)
రెబల్ స్టార్ ప్రభాస్ సంబంధించిన ఏ విషయమైనా ఎలాంటి సమాచారం అయినా మా నుంచి మీకు అందుతుంది- అంటూ ప్రభాస్ పిఆర్ టీం తెలియజేస్తూ ప్రకటన ఇచ్చింది. ఇప్పటివరకు ప్రభాస్ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్ పేరుతో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. అవేవీ నిజంకాదని ఆ టీమ్ తెలియజేస్తుంది. అంతేకాకుండా ప్రభాస్‌గారి సంబంధించిన ఏ విషయాన్ని రాసిని లేటెస్ట్ స్టిల్స్‌నే వాడండి అంటూ సూచన చేయడం విశేషం.
ప్రభాస్ గారి సినిమాలకు సంబంధించిన అధికారిక సమాచారం ఆ సినిమా పి అర్ ఓ నుంచి లేక ప్రభాస్ పి.ఆర్. టీమ్ నుంచి మీరు తీసుకోవచ్చు. దయచేసి ప్రభాస్ గారికి సంభందించిన న్యూస్ వేసేటప్పుడు రీసెంట్ ఫొటోస్ మాత్రమే ఉపయోగించవల్సిందిగా కోరుతున్నాము అంటూ వారు తెలియజేస్తున్నారు.