Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హిందీ భాషను కాదంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్టే : కంగనా రనౌత్

Kangana Ranaut
, శనివారం, 30 ఏప్రియల్ 2022 (15:50 IST)
దేశంలో గత కొంతకాలంగా ముఖ్యంగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ హిందీ ఆధిపత్య ధోరణి కనిపిస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలపై హిందీని బవంతంగా రుద్దాలని బీజేపీ పాలకులు ప్రయత్నిస్తున్నారు. కానీ, దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి వంటి రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో దేశంలో హిందీ వివాదం తీవ్రరూపం దాల్చింది. 
 
ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ల మధ్య ట్వీట్ల వార్ జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జాతీయ భాష హిందీ అని స్పష్టం చేశారు. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికైనా హిందీనే జాతీయ అంటూ ట్వీట్ చేశారు. పనిలోపనిగా అజయ్ దేవగణ్‌కు మద్దతు పలికారు. 
 
పైగా, హిందీ భాషను అంగీకరించకపోవడం అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమేనని ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, దేశంలో సంస్కృతాన్ని జాతీయ భాషను చేయాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని ఆమె చెప్పారు. హిందీ, ఇంగ్లీష్, జర్మనీ, ఫ్రెంచ్ వంటి భాషలన్నీ సంస్కృతం నుంచి పుట్టుకొచ్చినవేనని ఆమె గుర్తుచేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగ చైతన్య "ధూత" అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్