Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ విషయంలో అమెరికా పిచ్చిపని చేసిందన్న ట్రంప్... గిలగిలలాడుతున్న పాక్... ఎందుకు?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన మనసులో ఏది అనుకుంటారో దాన్ని అలాగే ఏమాత్రం ఎడిట్ చేయకుండా అనేస్తుంటారు. ఆ విషయం ఎన్నోసార్లు రుజువైంది కూడా. తాజాగా దాయది దేశం పాకిస్తాన్ విషయంలోనూ ఓ ట్వీట్ చేసి పాకిస్తాన్ దేశానికి తేరుకోలేని షాకిచ్చారు ట్రంప్.

Webdunia
మంగళవారం, 2 జనవరి 2018 (10:43 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన మనసులో ఏది అనుకుంటారో దాన్ని అలాగే ఏమాత్రం ఎడిట్ చేయకుండా అనేస్తుంటారు. ఆ విషయం ఎన్నోసార్లు రుజువైంది కూడా. తాజాగా దాయది దేశం పాకిస్తాన్ విషయంలోనూ ఓ ట్వీట్ చేసి పాకిస్తాన్ దేశానికి తేరుకోలేని షాకిచ్చారు ట్రంప్. 
 
గతంలో పాకిస్తాన్ దేశానికి సహాయ నిధులను అందించి పిచ్చి పని చేసిందని ట్వీట్ చేశారు. అంతేకాదు... ఉగ్రవాదుల విషయంలో పాకిస్తాన్ అబద్దాలు చెబుతోందంటూ ట్రంప్‌ ఉటంకించారు. దీనితో పాకిస్తాన్‌ అంతర్జాతీయ సమాజం ముందు ఇరకాటంలో పడిపోయింది. కొత్త సంవత్సరం వేళ పాకిస్తాన్ దేశానికి ట్రంప్ ఇచ్చిన షాక్ దెబ్బకు పాక్ ప్రధాని షాహిద్‌ ఖాన్‌ అబ్బాసీతో విదేశాంగ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ మంగళవారం అత్యవసరంగా భేటీ అయ్యారు. 
 
ట్రంప్‌ ట్వీట్‌ మీద ఏం చేయాలన్న దానిపై మాట్లాడినట్లు తెలుస్తోంది. అసలు ట్రంప్ ఏ ఉద్దేశ్యంతో ఈ ట్వీట్ చేశారంటూ అమెరికన్‌ రాయబారికి సమన్లు కూడా పంపారు. ఇవి తమకు చేరాయని అమెరికా రాయబార కార్యాలయం సైతం ధ్రువీకరించింది. మరి దీనిపై అగ్ర రాజ్యం ఎలాంటి బదులిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు మరింత వినోదం వుండేలా డిజైన్ చేస్తా : అనిల్ రావిపూడి

కెరీర్ లో యాక్షన్ టచ్ తో కామెడీ ఫిల్మ్ లైలా: విశ్వక్సేన్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments