Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరాచీలో కూలిన పాకిస్థాన్‌ విమానం.. 90 మంది ప్రయాణీకుల పరిస్థితి?

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (16:20 IST)
ప్రపంచ దేశాలు కరోనాతో అట్టుడికిపోతున్న వేళ.. తుఫానులు, రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయపెడుతున్నాయి. తాజాగా విమాన ప్రమాదం కూడా తోడైంది. దాయాది దేశమైన పాకిస్తాన్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. పాకిస్థాన్‌ అంతర్జాతీయ విమానయాన సంస్థకు చెందిన ఒక విమానం కరాచీ విమానాశ్రయానికి సమీపంలో ఒక కాలనీ వద్ద కూలిపోయింది. ఈ విమానంలో 90 మంది ప్రయాణీకులు ఉన్నారని తెలుస్తోంది.
 
లాహోర్‌ నుంచి ప్రయాణికులతో కరాచీ వెళ్తుండగా పాకిస్తాన్ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌లైన్స్ (పీఐఏ- ఏ320)కు చెందిన విమానం కుప్పకూలింది. కరాచీ ఎయిర్‌పోర్టుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో విమానం కూలినట్లు అధికారులు చెప్తున్నారు.  
 
కరాచీలోని మహ్మద్ ఆలీ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు సిద్దమవుతున్న సమయంలో ఎయిర్ బస్ 320 కుప్పకూలిందని పాక్‌ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ విమానం నివాస ప్రాంతంలో కుప్పకూలిందని, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయని తెలిపింది.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments