Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రికెట్ జాంబవంతుడు సచిన్‌ @30.. ట్రెండింగ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్స్

Advertiesment
క్రికెట్ జాంబవంతుడు సచిన్‌ @30.. ట్రెండింగ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్స్
, శుక్రవారం, 15 నవంబరు 2019 (13:08 IST)
భారత క్రికెట్ జాంబవంతుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ రంగంలో అడుగుపెట్టి 30 ఏళ్లు పూర్తయ్యాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించారు. సచిన్ అవుట్ అయితే టీవీని ఆఫ్ చేసిన వారు చాలామంది వున్నారు. 16వ ఏటనే తొలిసారిగా టెస్టు సిరీస్‌లో బరిలోకి దిగిన సచిన్ టెండూల్కర్‌కు ప్రస్తుతం 46 ఏళ్లు. 
 
1989వ సంవత్సరం కరాచీలో జరిగిన టెస్టు మ్యాచే ఆయన్ని క్రికెట్ దేవుడిని ఈ లోకానికి చూపెట్టేలా చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారిగా 30వేల పరుగులకు పైగా సాధించిన క్రికెటర్ అతనే. టెస్టు మ్యాచ్‌లో తొలిసారిగా అర్థ సెంచరీని సాధించిన భారత క్రికెటర్ కూడా ఆయనే. 2013కి తర్వాత సచిన్ రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. ఇంకా క్రికెట్ అంటేనే చాలామందికి సచినే గుర్తుకు వస్తుంటాడు. 
 
సచిన్ తన 16వ ఏట 1989, నవంబర్ 15వ తేదీన తొలి టెస్టు ఆడటం విశేషం. కాబట్టి నేటితో సచిన్ ప్రస్థానం ప్రారంభమై 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సచిన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో 30 Years Of Sachinism అనే హ్యాష్ ట్యాగ్‌ను సోషల్ మీడియాలో సచిన్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇంకా #SachinTendulkar అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిగ్గజ స్పిన్నర్ సరసన అశ్విన్.. తొలి భారత బౌలర్‌గా రికార్డు (video)