Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి వయస్సున్న వ్యక్తితో పెళ్లికి నో చెప్పిన వైద్య విద్యార్థిని.. తర్వాత ఏం జరిగింది?

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (09:29 IST)
పాకిస్థాన్ దేశంలో ఓ దారుణం జరిగింది. తన తంట్రి వయస్సున్న వ్యక్తితో పెళ్లికి ఓ వైద్య విద్యార్థిని నిరాకరించింది. అంతే.. ఆ యువతిని చిత్రహింసలు గురిచేశారు. లైంగికదాడి చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి తన స్నేహితురాలి తండ్రే కావడం గమనార్హం. ఆ వైద్య విద్యార్థినిపై కన్నేసిన ఈ దుర్మార్గుడు పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. అందుకు నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి రావడంతో "జస్టిస్‌ఫర్‌ఖతీజా" అనే హ్యాష్‌ట్యాగ్‌తో పాక్ నెటిజన్లు వైరల్ చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ డానిష్ ఓ పారిశ్రామికవేత్త. తనను పెళ్లాడేందుకు నిరాకరించిన మెడికల్ స్టూడెంట్‌ను చిత్రహింసలకు గురిచేశాడు. బాధితురాలిని నిందితులు ఈడ్చి పడేసి దాడి చేయడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకంటే దారుణం ఏంటంటే.. ఆమెకు గుండు గీసి, కనుబొమలు షేవ్ చేశారు. అంతేకాదు, ప్రధాన నిందితుడి కుమార్తె చెప్పులను ఆమెతో నాకించారు. ఇందుకు సంబంధించిన వీడియో గురువారం వైరల్ కావడంతో పోలీసులు వెంటనే స్పందించారు. 
 
ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు, అతడి కుమార్తె సహా 15 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలి ఇద్దరు సోదరులు యూకే, ఆస్ట్రేలియాలో ఉన్నారు. దీంతో ఆమె వృద్ధురాలైన తల్లిని చూసుకుంటూ దంతవైద్యంలో పైనల్ ఇయర్ చదువుతుంది. 
 
ఆమెకు తన క్లాస్‌మేట్ అయిన అన్నాతో కుటుంబ సంబంధాలు ఉన్నాయి. ఆమె తండ్రే ప్రధాన నిందితుడైన షేక్ డానిష్. బాధిత విద్యార్థిని వద్ద అతడు పెళ్లి ప్రస్తావన తీసుకురాగా ఆమె నిరాకరించింది. డానిష్ వయసు తన తండ్రి వయసుతో సమానమని, అతడిని తాను పెళ్లి చేసుకోలేనని అన్నాతో తాను చెప్పానని ఖతీజా గుర్తు చేసుకున్నారు. 
 
ఆమె ఆ మాట వినగానే తనపై చిందులేదని గుర్తు చేసుకున్నారు. ఈ నెల 8న ఆమె సోదరుడు యూకే నుంచి రాగా డానిష్ మరో 14 మంది వారింటికి వచ్చారు. ఖతీజాను తనకిచ్చి పెళ్లి చేయమని బలవంతం చేశారు. అందుకు అతడు కూడా నిరాకరించడంతో ఇద్దరినీ చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం వారిని డేనిష్ తన ఇంటికి తీసుకెళ్లి మరోమారు దాడిచేశారు. 
 
అంతేకాదు, ఖతీజాతో షూలు నాకించారు. ఆమె తల, కనుబొమలను షేవ్ చేశారు. ఈ మొత్తం ఘటనను వారు వీడియో తీశారు. అంతేకాదు, ఖతీజాను డేనిష్ ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వేధించినట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.  
 
విషయం వెలుగులోకి వచ్చాక పాక్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. హ్యాష్‌ట్యాగ్‌తో పాక్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. డానిష్ సహా నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
అదేసమయంలో ప్రధాన నిందితుడితో పాటు 15 మంది నిందితులను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చినప్పుడు వారిపై జడ్జి, పోలీసుల ఎదుటే న్యాయవాదులు దాడి చేసి, కోర్టు హాలులో నుంచి లాగిపడేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

సమంత ఇంట్లో విషాదం... 'మనం మళ్లీ కలిసే వరకు, నాన్న' ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం