Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం గారూ.. కారుణ్య మరణం ప్రసాదించండి... పదేళ్ళ బాలుడు వినతి

Advertiesment
Khammam Boy
హృదయాన్ని ఇట్టే కదిలించే ఘటన ఒకటి ఖమ్మం జిల్లాలో జరిగింది. తనకు కారుణ్య మరణం ప్రసాదించాలని పదేళ్ళ బాలుడు ఏకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని ప్రాధేయపడ్డాడు. తన అక్క, బావల వేధింపులు భరించలేక పోతున్నానని, అందువల్ల మెర్సీ కిల్లింగ్ చేయాలంటూ విజ్ఞప్తి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన సాయి అనే బాలుడు సీఎం కేసీఆర్‌ను ఓ విజ్ఞప్తి చేశాడు. తన తండ్రి గోరింట్ల లక్ష్మీనారాయణ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసి అనారోగ్యంతో మృతి చెందాడని, ఆ తర్వాత తల్లిని పాఠశాలలో అటెండర్‌గా నియమించారన్నారు.
 
కరోనా పేరుతో తన తల్లిని తన సోదరి, బావ చంపారని, అప్పటి నుంచి తన వద్ద ఉన్న డబ్బు, తల్లి ఉద్యోగం తన సోదరికి ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం తాను అద్దె ఇంట్లోనే ఉంటున్నానని, అయితే తన సోదరి, బావ తనను బెదిరిస్తున్నారని తెలిపారు. వారిద్దరి వేధింపులు భరించలేక పోతున్నానని, అందవుల్ల తనకు కారుణ్య మరణం ప్రసాదించాలని ప్రాధేయపడ్డాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో దుమ్ము దులుపుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు