Publish Date: Fri, 21 Jan 2022 (19:05 IST)
Updated Date: Fri, 21 Jan 2022 (19:06 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మిర్చి రైతులకు ఆ లేఖ ద్వారా మద్దతు పలికారు. రాష్ట్రంలో అకాల, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు.
ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందజేయాలన్నారు. రాష్ట్రంలో తామర తెగులు, భారీ వర్షాలతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వెంటనే రైతులను ఆదుకోకపోతే కాంగ్రెస్ పార్టీ తరపున రైతుల కోసం ప్రత్యక్ష కార్యాచరణను చేపడతామని రేవంత్‌రెడ్డి లేఖలో వెల్లడించారు.
మిర్చి రైతులకు ఎకరాకు రూ.50వేలు నష్టపరిహారంగా చెల్లించాలన్నారు. మిగత పంటలకు ఎకరానికి రూ. 25 వేలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటిస్తామని చెప్పి తర్వాత తప్పించుకొని మంత్రులను, అధికారులను పంపించారని ఆరోపించారు.