Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో వరద బీభత్సం - ఎటు చూసినా వరద నీరే...

Webdunia
మంగళవారం, 30 ఆగస్టు 2022 (13:38 IST)
పాకిస్థాన్‌ దేశంలో వరదలు భారీ ముంచెత్తాయి. గత మూడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆ దేశాన్ని వరదలు తాకాయి. ఈ వరద నీటి ప్రవాహం దెబ్బకు అనేక ప్రాంతాల్లో దాదాపు 150కిపైగా వంతెనలు కొట్టుకునిపోయాయి. అలాగే, వెయ్యిమందికిపైగా వరద బాధితులు మృత్యువాతపడ్డారు. దీంతో పాకిస్థాన్‌కు సాయం అందించేందుకు ఖతర్, ఇరాన్ వంటి దేశాలు ముందుకు వచ్చాయి. 
 
గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ దేశాన్ని భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. దీంతో భారీ వదలు సంభవించాయి. ఈ వరదల కారణంగా ఇప్పటివరకు 1033 మంది చనిపోయినట్టు పాకిస్థాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత 24 గంటల్లోనే 119 మంది మృత్యువాతపడినట్టు తెలిపింది. అలాగే, ఈ వరదల కారణంగా 1500 మంది వరకు గాయపడినట్టు పాకిస్థాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. 
 
పాకిస్థాన్ దేశంలో ఈ తరహాలో వర్షాలు కురవడం, వరదలు సంభవించడి గత 30 యేళ్ళలో ఇది తొలిసారి కావడం గమనార్హం. సాధారణంగా పాక్‌లో సగటు వర్షపాతం 132.3 మిల్లీమీటర్లుగా ఉంటుంది. ఈ యేడాది జూన్ నుంచి ఇప్పటివరకు ఏకంగా 385 మిల్లీ మీటర్ల వర్షంపాతం నమోదైంది. 
 
ఈ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఫలితంగా దాదాపు 3.30 కోట్ల మంది వరద బాధితులయ్యారని వెల్లడించారు. వరద బాధితులను ఆదుకునేందుకు పాక్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

కృష్ణుడికి భక్తుడికి మధ్య నడిచే కథే డియర్ కృష్ణ : పి.ఎన్. బలరామ్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments