Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ అబద్ధాల కోరు.. లాడెన్ జాడ తెలిసి కూడా..?: డొనాల్డ్ ట్రంప్

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (15:56 IST)
పాకిస్థాన్‌కు తామెందుకు సాయం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు. పాకిస్థాన్ వల్ల తమకు ఒరిగేదేమీ లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ వంటి దేశానికి అమెరికా ప్రతీ ఏడాది 1.3 బిలియన్ డాలర్లు సహాయం చేస్తోంది.


అయినా తమకు వారి వల్ల ఒరిగేదేమీ ఉండటం లేదని.. పైగా లాడెన్ లాంటి వ్యక్తికి తమ భూభాగంలో చోటు ఇచ్చి తమకు సమాచారం కూడా ఇవ్వలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇలాంటి విషయాలను బట్టి ఆలోచిస్తే.. తమకు పాకిస్థాన్‌కి సహాయం చేయడం సముచితం కాదని అనిపిస్తున్నట్లు తెలిపారు. 
 
అందుకే పాకిస్థాన్‌కు అందించే సాయాన్ని ఇవ్వకూడదని భావించినట్లు ట్రంప్ చెప్పారు. అమెరికా పాకిస్థాన్ నుంచి ఏమి ఆశించి.. గత 15 ఏళ్లుగా ఆర్థిక సాయం చేస్తుందో తనకు అర్థం కావట్లేదన్నారు. ఇప్పటి వరకు అమెరికా 33 బిలియన్ డాలర్లను పాకిస్థాన్‌కు సహాయంగా ఇచ్చిందని.. అయినా పాకిస్థాన్ అబద్ధాల కోరుగా వ్యవహరించిందని.. లాడెన్ జాడ తెలిసి కూడ చెప్పలేదని ట్రంప్ అన్నారు.
 
పాకిస్థాన్ సర్కార్ ఏమనుకుంటోంది... అమెరికా నాయకులు చేతకాని వారనుకుంటుందా.. తమ సైనికులు ఉగ్రవాదుల వేట కోసం ఆప్ఘనిస్థాన్లో పడికాపులు పడుతుంటే.. లాడెన్ జాడ తెలిసి కూడా వారు చెప్పలేదని.. ఇంత నమ్మకద్రోహం చేసిన దేశానికి, అమెరికా ఎందుకు సహాయం చేయాలని.. అందుకే ఈ ప్రతిపాదనకు విముఖత చూపానని గతంలో కూడా ట్రంప్ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments