Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఘోరం.. కలుషిత సిరంజీతో 400 మందికి ఎయిడ్స్ ఎక్కించాడు..

Webdunia
శుక్రవారం, 17 మే 2019 (11:54 IST)
తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శివకాశి ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణికి హెచ్‌ఐవీ బాధితుని రక్తం ఎక్కించిన ఘటన సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. దాయాది దేశం అయిన పాకిస్థాన్‌లో ఓ వైద్యులు కలుషి సిరంజీని వాడాడు. ఈ సిరంజీ ద్వారా దాదాపు 400 మంది చిన్నారులకు ఎయిడ్స్ సోకేలా చేశాడు.


ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఇప్పటికే ఎయిడ్స్ కేసులో పాకిస్థాన్ ఆసియాలోనే రెండో స్థానంలో ఉంది. ఒక్క 2017లోనే పాకిస్థాన్‌లో కొత్తగా 20,000 కేసులు నమోదయ్యాయి.
 
వివరాల్లోకి వెళితే.. లర్కానా జిల్లాలోని రటోడెరో ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ ముజఫర్ గంగర్ వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. అయితే సిరంజీలు అందుబాటులో లేకపోవడంతో వైద్యులు ఒకే సూదిని వేడినీటిలో మరగబెట్టి వాడటం ప్రారంభించారు. ఈ క్రమంలో దాదాపు 400 మంది చిన్నారులకు ఎయిడ్స్ సోకింది. వీరిలో అత్యధికులు చిన్నారులు కావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
దీంతో ఈ ఆస్పత్రిలో చికిత్స పొందిన ప్రజలందరికీ హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాకుండా.. ఈ ఘోరానికి కారకుడైన వైద్యుడు ముజఫర్‌కు కూడా ఎయిడ్స్ ఉన్నట్లు అధికారులు తేల్చారు.

ఈ వ్యవహారంపై ముజఫర్ స్పందించాడు. తనకు హెచ్ఐవీ వున్న విషయం తనకు తెలియదని.. కావాలనే తాను కలుషిత సిరంజీని వాడలేదని.. స్పష్టం చేశాడు. కాగా.. ఈ డాక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి.. రిమాండుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments