Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ.50కోట్లు ఇస్తే మోదీని చంపేస్తా.. అవును నేనే అలా అన్నాను..

రూ.50కోట్లు ఇస్తే మోదీని చంపేస్తా.. అవును నేనే అలా అన్నాను..
, మంగళవారం, 7 మే 2019 (08:34 IST)
తనకు రూ.50కోట్లు ఇస్తే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చంపేస్తానని బీఎస్ఎఫ్ మాజీ జవాను తేజ్ బహదూర్‌ కామెంట్స్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఎన్నికల్లో తేజ్ బహదూర్ సమాజ్ వాదీ పార్టీ టికెట్‌పై వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. అయితే, అతడి దరఖాస్తును ఈసీ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో తాజాగా వైరల్ అవుతున్న వీడియోపై తేజ్ బహదూర్ స్పందించాడు. 
 
రెండేళ్ల క్రితం నాటిదిగా భావిస్తున్న ఈ వీడియోలో ఉన్నది తానేనని తేజ్ బహదూర్ అంగీకరించాడు. అయితే, దీని వెనక కుట్ర ఉందని బహదూర్ ఆరోపించాడు. ఓ స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు ఉన్న ఈ వీడియోలో తనకు ఎవరైనా రూ.50 కోట్లు ఇస్తే మోదీని చంపేస్తానని బహదూర్ అనడం స్పష్టంగా వినిపిస్తోంది. 
 
సంచలనం సృష్టిస్తున్న ఈ వీడియోపై బీజేపీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇటువంటి సంఘ విద్రోహ శక్తుల వెనక ఉన్నది కాంగ్రెస్సేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలీస్ స్టేషన్లో కాంట్రాక్టర్ బర్త్ డే.. కేక్ తినిపించిన పోలీసులు..