Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వింగ్ కమాండర్ అభినందన్ యూనిట్‌కు కొత్త బ్యాడ్జి

Advertiesment
వింగ్ కమాండర్ అభినందన్ యూనిట్‌కు కొత్త బ్యాడ్జి
, గురువారం, 16 మే 2019 (11:19 IST)
భారత వైమానికదళ విభాగానికి చెందిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ధైర్య సాహసాలను ఈ ప్రపంచం కళ్లారా వీక్షించింది. శత్రుసైన్యానికి చిక్కినప్పటికీ అభినందన్ ప్రదర్శించిన ధైర్యసాహసాలతో పాటు.. సంయమనం ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేసింది. 
 
భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చిన పాకిస్థాన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని మిగ్-21 విమానంతో అభినందన్ కూల్చివేశాడు. ఈ ఘటన ఫిబ్రవరి 27వ తేదీన జరిగింది. ఆ తర్వాత పాకిస్థాన్ సైన్యానికి బందీగా చిక్కాడు. 
 
అయితే, భారత ప్రభుత్వం చేసిన దౌత్యఒత్తిడి కారణంగా అభినందన్ వర్ధమాన్ శత్రుసైన్యం నుంచి ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. పిమ్మట నెల రోజుల పాటు వివిధ రకాల వైద్య పరీక్షలతో పాటు ఫిట్నెస్ పరీక్షలను ఎదుర్కొని తిరిగి విధుల్లో చేరారు. ఈ క్రమంలో అభినందన్ ధైర్యసాహసాలకు ప్రతీకకగా ఆయన విధులు నిర్వహించే యూనిట్ సభ్యులంతా సరికొత్త బ్యాడ్జీలను ధరిస్తున్నారు. 
 
ఈ విషయాన్ని ప్రముఖ ఎలక్ట్రానిక్ న్యూస్ చానెల్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పేర్కొందేగానీ, భారత వైమానికదళం మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఇది ఫేక్ వార్త అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పగబట్టిన విధి : మృగాళ్ళ వేధింపులు భరించలేక...