Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫీసులకు రాకండి.. కానీ జీతాలిస్తాం.. ఎక్కడబ్బా?!

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (23:54 IST)
రష్యాలో కరోనా విలయతాండవం చేస్తోంది. కోవిడ్ కేసుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 30 నుంచి వారం పాటు వేతనంతో కూడిన సెలవులను ఇస్తున్నట్టు ప్రకటించారు. 
 
దీని ప్రకారం ఉద్యోగులెవ్వరూ ఆఫీసులకు వెళ్లాల్సిన పనిలేదు. పైగా ఆ వారం పాటు ప్రజలు ఎవరి ఇళ్లలో వాళ్లు ఉంటూ మహమ్మారి అంతానికి సహకరించడంతో వారి జీతం కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. 
 
కరోనా కట్టడి కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని పుతిన్ పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ తీసుకోవడాన్ని ఓ బాధ్యతగా చూడాలన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ రష్యానే కనిపెట్టినప్పటికీ అక్కడి పౌరులు వ్యాక్సిన్ వేసుకోవడానికి అంతగా సుముఖంగా లేరు. 
 
దీంతో వ్యాక్సినేషన్ నత్త నడకన సాగుతోంది.  గడిచిన 24 గంట్లలో రష్యాలో కొత్తగా 34,074 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా సగటున రోజుకు 1000 కరోనా మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో రష్యాలో 1,028 మంది మరణించారు.

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments