Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహా తాతయ్యా.. పెయింట్‌ను పెరుగు అనుకుని తినేశావా?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (15:12 IST)
మానవ ఆరోగ్య రక్షణలో పెరుగు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పెరుగును చాలా ఇష్టంగా తినేవారు కూడా ఉన్నారు, అయితే న్యూయార్క్‌కు చెందిన బాబీ అనే 90 ఏళ్ల తాత ఇంటికి వేసే పెయింట్‍ను పెరుగు అనుకుని తినేశాడు. ఇంటికి రంగు వేయడం కోసం తెచ్చిన పెయింట్ డబ్బాను చూసి, అది తన కోసం తెచ్చారనుకుని పెయింట్ డబ్బా మూతను తీసి వెంటనే సగం తినేశాడు. అది చూసిన మనవరాలు అలెక్స్ స్టెయిన్ గట్టిగా కేకపెట్టింది.
 
అరుపు విన్న తాతగారు ఆమె వైపు అమాయకంగా చూసాడు. మింట్ ఫ్లేవర్‌లో ఉన్న పెరుగు చాలా రుచిగా ఉందని తాత ఆమెతో అన్నాడు. అయ్యో తాతయ్య, అది పెరుగు కాదు పెయింట్ అని ఆమె చెప్పడంతో ఆయన ఒక్కసారిగా షాకయ్యాడు. పెయింట్ తిన్నందుకు ఆయన పెద్దగా ఫీల్ కాలేదు. ఈ పూర్తి సంఘటనను అలెక్స్ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. బాబీ తిన్న పెయింట్ డబ్బాను, పెయింట్‌ అంటుకున్న పెదాలతో ఉన్న తాత ఫొటోను ట్వీట్ చేసింది.
 
తాతయ్యకు పెరుగు అంటే చాలా ఇష్టమని, తన కోసం అమ్మ వెనిల్లా ఫ్లేవర్‌లో లభించే పెరుగును రోజూ కొని ఇంట్లో పెట్టేది, అయితే తాత పెయింట్ డబ్బాను చూసి పెరుగనుకుని తినేశాడు. అందుకు తాతయ్య ఏమీ బాధపడలేదు అంటూనే పెయింట్ తిన్న తర్వాత ఎలాంటి ఇబ్బందికి గురికాలేదని చెప్పింది.

ఈ ఘటనపై బాబీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్పందిస్తూ తాను పెయింట్ తిన్నానని, వాస్తవానికి పెరుగు కంటే పెయింట్ చాలా టేస్టీగా ఉందని, అలాగే అలా చేసినందుకు తాను ఎలాంటి పశ్చాతాపం పడటం లేదని పోస్ట్ చేసాడు. ముసలాయన గట్టి మనిషే మరి!

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments