Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్లముందే ప్రియుడితో సల్లాపాలు.. చూసి జీర్ణించుకోలేక భర్త సూసైడ్

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (14:30 IST)
అక్రమ సంబంధం మరో ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో పడి వివాహేతర సంబంధం కొనసాగించిన భార్యను చూసి జీర్ణించుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. రొళ్ల వడ్రహట్టి గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప కుమారుడు పీజీ నాగరాజు (28)కు అదే గ్రామానికి చెందిన యువతితో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన యేడాది వరకూ ఎలాంటి గొడవలూ లేకుండా సాఫీగా సంసారాన్ని సాగించారు. 
 
కొన్నాళ్ల తర్వాత అదే గ్రామానికి చెందిన హెచ్‌. నాగరాజు అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇంకా అతనితో  సన్నిహితంగా మెలగసాగింది. క్రమేపి అక్రమ సంబంధం కూడా పెట్టుకుంది. ఈ విషయంగా భార్యాభర్తలిద్దరూ చాలాసార్లు గొడవపడ్డారు. భార్య మాట వినకపోవడంతో విసిగిపోయాడు. గత గురువారం భార్య ప్రియుడు హెచ్ నాగరాజుతో కలిసి ఉండటాన్ని అతడు చూశాడు. భార్యతో గొడవపడి ఇంటి నుండి వెళ్లిపోయాడు. 
 
మూడు రోజుల నుండి వెతుకుతున్నా ఆచూకీ తేలలేదు. చివరికి ఇందిరమ్మ కాలనీ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కొడుకు మృతదేహాన్ని చూసి చలించిపోయిన తండ్రి హనుమంతరాయప్ప పోలీసులకు ఫిర్యాదు చేసాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments