Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సిగరెట్ కాల్చొద్దయ్యా మగడా అంటే... కంట్లో కత్తితో పొడిచాడు..

Advertiesment
సిగరెట్ కాల్చొద్దయ్యా మగడా అంటే... కంట్లో కత్తితో పొడిచాడు..
, ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (08:26 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మందుకొట్టే, సిగరెట్ కాల్చే పురుషులను మార్చాలని చాలామంది భార్యలు ప్రయత్నిస్తుంటారు. తాజాగా సిగరెట్ తాగొద్దన్నందుకు ఓ వ్యక్తి తన భార్య కంట్లో కత్తితో పొడిచిన ఘటన కర్ణాటక, కృష్ణరాజపురంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. లింగరాజపురంలో నివసిస్తున్న ధర్మ అనే వ్యక్తి చాలా కాలంగా దురలవాట్లకు బానిసయ్యాడు. ఈ క్రమంలో కొద్ది కాలం క్రితం ధర్మకు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో వైద్యపరీక్షలు చేసిన వైద్యులు ఇకపై సిగరెట్లు తాగొద్దంటూ సూచించారు. 
 
అయినా ధర్మ స్మోకింగ్ అలవాటు వదల్లేదు. గురువారం రాత్రి సిగరెట్ కాల్చుతున్న భర్తను వద్దని భార్య గాయత్రి వారించింది. దీంతో కోపోద్రిక్తుడైన ధర్మ కత్తితో గాయత్రి కంట్లో పొడిచాడు. గాయత్రి కేకలు వేస్తూ బయటకు రావడంతో గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాణసవాడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రజల నాడిని అలా పట్టేసిన ఆర్కే రోజా.. ఎలా?