Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర కొరియా డిక్టేటర్ ఊపిరితో ఉన్నారా? పోయారా?

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (08:27 IST)
ఉత్తర కొరియా హిట్లర్‌గా పేరుగాంచిన ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చనిపోయినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కిమ్ మరణించాడంటూ ఓ జర్నలిస్ట్ చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ, ఈ ట్వీట్‌పై ఉత్తర కొరియా మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వార్తను ఉత్తర కొరియా గూఢచార సంస్థ కూడా ఖండిస్తోంది. 
 
మరోవైపు, కిమ్‌ ప్రస్తుతం కోమాలో ఉన్నారని, ఆయన మరణించలేదని దక్షిణ కొరియా రాజకీయ వ్యవహార శాఖలో గతంలో ఉన్నతాధికారిగా పనిచేసిన చాంగ్‌ సాంగ్‌ మిన్‌ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. దీంతో కిమ్‌ కోమాలో ఉన్నట్టు వార్తలు ప్రచారం అయ్యాయి. ఈ క్రమంలో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరణించారని తాను విశ్వసిస్తున్నట్టు ఇటీవల ఉత్తర కొరియాకు వెళ్లి వచ్చిన జర్నలిస్ట్‌ రాయ్‌ కాలే తెలిపారు. 
 
ఉత్తర కొరియా యంత్రాంగం ఉద్దేశపూర్వకంగానే కిమ్‌ ఆరోగ్యంపై స్పష్టతనివ్వడంలేదని, నిజాన్ని బహిర్గతం చేస్తే దేశంలో పెద్దఎత్తున కార్యచరణలు మారే అవకాశం ఉండటంతో విషయాన్ని దాచిపెడుతున్నారని వివరించారు. కిమ్‌ లేదా ఇతర నేతల ఎలాంటి సమాచారాన్నైనా ప్రజలకు చెప్పడానికి వాళ్లు ఇష్టపడరని ఆరోపించారు. 
 
ఉత్తర కొరియా మాజీ పాలకుడు కిమ్‌ జోంగ్‌ ఇల్‌ మరణించినప్పుడు కూడా ఇలాగే జరిగిందని కాలే గుర్తుచేశారు. ఇల్‌ మరణించిన కొన్ని నెలల తర్వాత ఆ విషయాన్ని అక్కడి యంత్రాంగం ప్రకటించిందని తెలిపారు. ప్రస్తుతం కిమ్‌ మృతి చెందారో లేదోనన్న విషయం ఆయన సోదరి కిమ్‌ యో జోంగ్‌ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాతనే తెలుస్తుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పెళ్లి వచ్చే నెలలో గోవాలో జరుగుతుంది : కీర్తి సురేష్ (Video)

అజిత్ కుమార్ విడాముయర్చి టీజర్ ఎలా వుంది?

నటుడు సుబ్బరాజు భార్య నేపథ్యం ఏంటో తెలుసా?

పార్టీ ఇచ్చిన 'సిటాడెల్' టీం... సమంత డ్యాన్స్.. Video Viral

అతను స్వార్థం తెలియని ప్రజానేత... రాజ్యసభ సీటుపై మెగా బ్రదర్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments