Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిజ్జా వద్దన్న పాపానికి అమ్మనే చంపేశాడు... ఎక్కడ?

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (13:38 IST)
స్మార్ట్ ఫోన్లపై నేటి యువతకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాగే పిజ్జాలు, బర్గర్లు అంటే తెగ ఇష్టపడుతున్నారు. తమకు కావలసిన వస్తువులు, ఆహార పదార్థాల కోసం యువత దేనికైనా సిద్ధపడుతున్నారు. వద్దంటే తల్లిదండ్రులతో గొడవపడుతున్నారు. కానీ ఇక్కడొకడు పిజ్జా ఆర్డర్ చేసుకుంటానంటే తల్లి వద్దని చెప్పిందని.. ఆమెను హతమార్చాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన నళిని (51) భర్త, కుమారుడితో కలిసి అమెరికాలోని నార్త్ కరోలోనాలో స్థిరపడ్డారు. నళిని కుమారుడు ఆర్నవ్.. చెడు అలవాట్లకు బానిసగా మారాడు. దీన్ని గమనించిన నళిని అతని కట్టడి చేసేందుకు సిద్ధమైంది. దీన్ని తెలుసుకున్న ఆర్నవ్ తల్లిని శత్రువుగా చూడటం మొదలెట్టాడు. ఆమెపై పగను పెంచుకున్నాడు.
 
ఓసారి పిజ్జా వద్దని చెప్పినా ఆర్డర్ చేశాడని ఆర్నవ్‌ను నళిని కోపంతో చెంపపై కొట్టింది. దీంతో ఆవేశానికి గురైన ఆర్నవ్ ఆమెను గొంతు నులిమి హతమార్చాడు. ఆస్పత్రికి ఆర్నవ్ తీసుకెళ్లలేకపోవడంతో నళిని ప్రాణాలు కోల్పోయింది. 
 
ఈ ఘటనపై మైనర్ కావడంతో ఇన్నాళ్లు కేసు నమోదు చేయని పోలీసులు.. గత ఏడాది అభియోగాలు నమోదు చేశారు. ఇంకా ఆర్నవ్ తల్లిని హత్య చేశానని ఒప్పుకున్నాడు. దీంతో అతనికి 15 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments