Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సరదాలకు అడ్డుకట్ట వేసిందనీ తల్లిని హత్య చేసిన తనయుడు

సరదాలకు అడ్డుకట్ట వేసిందనీ తల్లిని హత్య చేసిన తనయుడు
, ఆదివారం, 2 డిశెంబరు 2018 (09:47 IST)
నవమాసాలు మోసి, పురిటి నొప్పులు భరించి జన్మనిచ్చిన ఓ కన్నతల్లిని కన్నబిడ్డే హత్య చేసింది. కేవలం తన సరదాలకు అడ్డు చెప్పిందన్న అక్కసుతో తనయుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అమెరికాలోని నార్త్ కరోలోనా రాష్ట్రంలో మూడేళ్ళ క్రితం నళిని తేలప్రోలు (51) అనే మహిళ హత్యకు గురైంది. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు దిగ్భ్రాంతికి గురిచేసే నిజం వెలుగు చూసింది. ఈ హత్య కేసులో కన్నబిడ్డే అసలైన ముద్దాయి అని తేల్చారు. 
 
'చదువంటే పెద్దగా ఇష్టంలేని తనకు సరదాలు, జల్సాలంటే అమితమైన ఇష్టం. వీటికి తన తల్లి అడ్డుకట్ట వేసింది. దీంతో ఆమెపై ఆగ్రహం పెరిగింది. ఈ క్రమంలో 2015 నవంబరులో తన తండ్రి వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్లాడు. ఆ సమయంలో పిజ్జాకు ఆర్డర్ ఇచ్చే సమయంలో తనకు, తన తల్లికి మధ్య గొడవ జరిగింది. దీంతో కుమారుడు ఆర్నవ్‌పై నళిని చేయి చేసుకుంది. 
 
దీన్ని భరించలేక తల్లిని చంపేసి, మృతదేహాన్ని కారులోకి ఎక్కించలేక అక్కడే వదిలేసినట్టు 16 యేళ్ళ ఆర్నవ్ ఉప్పలపాటి వెల్లడించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, హత్య జరిగినపుడు ఆర్నవ్ వయసు 16 యేళ్లు. దీంతో అతన్ని అరెస్టు చేయలేదు. ఈ క్రమంలో ఈ కేసు విచారణ పూర్తికాగా, ప్రస్తుతం అతని వయసు 19 యేళ్లు. ఈ కేసులో ముద్దాయిగా తేలాడు. దీంతో అతనికి 12 నుంచి 15 యేళ్ళపాటు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ప్రచారంతో జనసేనానిని దెబ్బతీయడం సాధ్యమా..?