Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాల్యాకు న్యూఇయర్ షాక్- ఆస్తుల వేలానికి కోర్టు అనుమతి

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (16:12 IST)
బ్యాంకు రుణాలు ఎగొట్టి, విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఆస్తులను వేలం వేయడానికి ముంబయి ప్రత్యేక కోర్టు మార్గం సుగమం చేసింది. జప్తు చేసిన ఆస్తులును బ్యాంకులు వినియోగించుకునేందుకు అనుమతించింది.

అయితే ఈ ఆదేశాలను అపీలు చేసుకునేందుకు వీలుగా ఉత్తర్వుల అమలుపై జవవరి 18 వరకు స్టే విధించింది. బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు కొత్త సంవత్సరాది రోజునే ఎదురుదెబ్బ తగిలింది.

జప్తు చేసిన ఆస్తులను బ్యాంకులు వినియోగించుకోవడానికి ముంబయిలోని మనీలాండరింగ్ నిరోధక కోర్టు బ్యాంకులకు అనుమతి ఇచ్చినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు వెల్లడించారు. అయితే ఉత్తర్వులను కోర్టు జనవరి 18 వరకు నిలిపివేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈ ఆదేశాలపై సంబంధిత పక్షాలు(మాల్యా) బొంబాయి హైకోర్టులో అపీలు చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

జప్తు చేసిన ఆస్తులు వేలం వేయడానికి బ్యాంకుల కన్సార్టియంకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇదివరకే ప్రత్యేక కోర్టుకు తెలిపింది ఈడీ. 2013 నుంచి చెల్లించాల్సిన మొత్తానికి వడ్డీతో కలిపి రూ. 6,203.35 కోట్లకు ఆస్తుల వేలం నిర్వహించాలని బ్యాంకుల కన్సార్టియం భావిస్తోంది.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments