Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతో సంబరాల్లో కార్మికులు

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (16:09 IST)
నూతన సంవత్సరం ఆర్టీసీ కార్మికులకు కొత్త కానుక తీసుకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు సర్కారు నిర్ణయించడంతో వారి చిరకాల కోరిక నెరవేరింది. నేటి నుంచి ప్రభుత్వంలో సరికొత్తగా ఆవిర్భవించిన ప్రజారవాణా విభాగం కింద వారంతా పనిచేయనున్నారు. కొత్త ఏడాది, విలీనాన్ని కలిపి ఒకేసారి కార్మికులు వేడుకలు చేసుకుంటున్నారు.

ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులంతా ఇవాళ్టి నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఆర్టీసీలోని 54 వేల మంది కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసిన సీఎం జగన్.... ఆర్టీసీని ప్రజారవాణా విభాగం కిందికి తీసుకొచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

నిపుణుల కమిటీలోని సభ్యులతో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పేర్ని నాని, ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని సిఫార్సు చేసింది. ఇప్పటికే మంత్రివర్గంలో ఆమోద ముద్ర వేసిన అనంతరం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగ విరమణ పెంచుతూ నిర్ణయం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కొత్తగా ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేశారు.

ఆర్టీసీలో ప్రస్తుతం పనిచేస్తోన్న 54 వేల మంది ఉద్యోగులందరూ ఈ శాఖ కిందకు వస్తారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 60 కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. బస్సు చార్జీలు ఫెయిర్‌గా ఉండేలా ట్రాన్స్‌పోర్ట్‌ రెగ్యులేటరీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.

కీలకంగా వ్యవహరించిన ఆర్టీసీ ఉద్యోగులు 75 ఏళ్లకు పైబడి సుధీర్ఘ సేవలందిస్తూ, ప్రయాణీకుల ఆదరాభిమానాలు పొందిన ఆర్టీసీ... గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది. ప్రయాణీకుల భద్రతే లక్ష్యంగా ప్రతీరోజూ సుమారుగా 85 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ అందరి మన్ననలు అందుకుంటూ ముందుకు సాగుతుంది.

సంస్థకు ఘన చరిత్రను అందించడంలో ఆ సంస్థ ఉద్యోగులు కీలకంగా వ్యవహరించారు. ఇకపై వారంతా ప్రజా రవాణా వ్యవస్థ కింద విధులు నిర్వహించనున్నారు. ప్రజారవాణా విభాగంలో విలీనం అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సౌకర్యాలు ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. గత ఐదేళ్లుగా కార్మికులు ఎదురుచూస్తున్న కారుణ్య నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతోనే ఆర్టీసీ యాజ మాన్యం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

తొలి విడతలో 2015 డిసెంబర్‌ 31 వరకు 237 మంది పేర్లతో ఉన్న జాబితాను ఆమోదించింది. వీరందరికీ మెడికల్‌ పరీక్షలు నిర్వహించి శిక్షణకు పంపించారు. కండక్టర్ల అభ్యర్థుల ఎత్తును 153 సెం.మీల నుంచి 145 సెం.మీలకు తగ్గిస్తూ నిబంధనలు సవరించారు.

అలాగే విధులకు గైర్హాజరై ఉద్యోగం కోల్పోయిన మొత్తం 135 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. 2015 తర్వాత కారుణ్య నియామకాలను త్వరలో చేపట్టేందుకు.. కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

తర్వాతి కథనం
Show comments