Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచార బాధితురాలి వద్ద అలాంటి ప్రశ్నలు వేసిన జడ్జి..? కాళ్లు ముడుచుకోలేదా?

Webdunia
గురువారం, 11 ఏప్రియల్ 2019 (13:58 IST)
న్యూజెర్సీ కోర్టుకు చెందిన జడ్జి మూడు మాసాల పాటు సస్పెండ్ వేటుకు దగ్గర్లో వున్నారు. అత్యాచార బాధితురాలి వద్ద అనుచిత ప్రశ్నలు వేసినందుకు గాను కోర్టు ప్యానెల్ ఆయన్ని మూడు నెలల పాటు సస్పెండ్ చేయాలని సిఫార్సు చేసింది. 
 
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవల అత్యాచారానికి గురైన బాధితురాలు కోర్టుకు హాజరైంది. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో బాధితురాలి వద్ద జడ్జి జాన్ రుస్సో వేసిన ప్రశ్నలు అందరినీ షాక్‌కు గురి చేశాయి. అత్యాచారం చేస్తున్న సమయంలో కాళ్లు ముడుచుకోలేదా అని ప్రశ్నించారు. 
 
ఇంకా శరీర భాగాలను రక్షించుకోలేదా..? తప్పించుకోవడానికి ప్రయత్నించలేదా? అంటూ బాధితురాలిని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు బాధితురాలు సమాధానం చెప్పింది. అయితే ఈ తరహా ప్రశ్నలు వేయాల్సిన అవసరం లేదని జడ్జి ప్యానెల్ అభిప్రాయపడింది. 
 
తొమ్మిది మంది సభ్యుల జడ్జి ప్యానెల్ జాన్‌కు ఎలాంటి శిక్షను విధించాలనే దానిపై చర్చిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన తీర్పు ఈ ఏడాది జూలైలో వచ్చే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

Nabha : ఎలీ ఇండియా జూలై మేగజైన్ కవర్ పైజీపై నభా నటేష్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments