Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం మానేస్తున్న బ్రిటన్ పౌరులు.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2022 (11:33 IST)
బ్రిటన్ పౌరులు భోజనం తినడం మానేస్తున్నారు. ఆ దేశంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా జీవన వ్యయం పెరిగిపోయింది. దీంతో అనేక మంది భోజనం తినడం మానేస్తున్నారు. బ్రిటన్ కొత్త ప్రధానిగా లిజ్ ట్రస్ ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ప్రధానిగా ఆమె తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. 
 
ముఖ్యంగా, పన్నులను భారీగా పెంచేశారు. విద్యుత్ చార్జీలను ఫ్రీజ్ చేశారు. ఫలితంగా ఆరోగ్యకరమైన భోజనానికి అనేక మంది దూరమైపోతున్నారు. అన్ని రకాల వస్తువులు ఏకంగా పది శాతానికిపైగా పెరిగిపోయాయి. దీంతో ద్రవ్యోల్బణం కూడా పెరిగిపోయింది. దాదాపు 80 శాతం మంది  ప్రజలు సంక్షోభంలో చిక్కుకునిపోయారు. 
 
దేశ ప్రధానిగా లిజ్ ట్రస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశ పౌరుల జీవన వ్యయం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఫలితంగా దాదాపు సగం మంది యూకే ప్రజలు తాము తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నారని, తీసుకునే భోజనాల సంఖ్యను తగ్గిస్తున్నారని 'విచ్' అనే సంస్థ తెలిపింది. ఈ సంస్థ తాజాగా 3 వేల మందిపై ఓ సర్వే నిర్వహించి, ఈ ఫలితాలను వెల్లడించింది. 
 
దేశంలో ఆర్థిక సంక్షోభానికి ముందు పోలిస్తే, దాదాపు 80 శాతం మంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవన వ్యయ సంక్షోభం ప్రజలపై వినాశకర ప్రభావాన్ని చూపిస్తుందని 'విచ్' ఫుడ్ పాలసీ హెడ్ స్యూ డేవీస్ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
మిలియన్ల మంది ఒక పూట భోజనాన్ని దాటవేస్తున్నారని పేర్కొన్నారు. ఫలితంగా ఆరోగ్యకరమైన భోజనాన్ని దూరం చేస్తుందని పేర్కొన్నారు. విద్యుత్ ధరలను ఫ్రీజ్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లను వేడిగా ఉంచుకోలేకపోతున్నారని కన్జుమర్ గ్రూప్ పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments