Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇవాంకా ప్రేమకు డొనాల్డ్ ట్రంప్ పూర్తి మద్దతు.. పోచంపల్లి పట్టుచీర రెడీ..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఈ నెల హైదరాబాదులో జరిగే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న వేళ.. ఆమె వ్యక్తిగత వివరాలను తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఇందులో ఇవాంకా ప్రేమ కథ కూడా

Webdunia
గురువారం, 23 నవంబరు 2017 (09:32 IST)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఈ నెల హైదరాబాదులో జరిగే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న వేళ.. ఆమె వ్యక్తిగత వివరాలను తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఇందులో ఇవాంకా ప్రేమ కథ కూడా ఒకటి. ఇవాంకా ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ కోసం మతం కూడా మారారు. 2005లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా జేడ్ కుష్నర్‌ను ఇవాంకా తొలిసారి కలిశారు. 
 
ఆ పరిచయం క్రమక్రమంగా ప్రేమగా మారింది. వ్యాపారం, వ్యక్తిగత అభిరుచులు కలవడంతో మూడేళ్ల పాటు ఇవాంకా కుష్నర్ డేటింగ్ చేశారు. ఈ విషయం కుష్నర్ తల్లిదండ్రులకు తెలియడంతో సంప్రదాయ యూదులైన వారు ఆ బంధానికి అభ్యంతరం తెలిపారు. దీంతో వారిద్దరూ విడిపోయారు. దీనిని తెలుసుకున్న ఇవాంకా క్రైస్తవ మతం వదిలి యూదు మతం స్వీకరించి 2009లో కుష్నర్ ను వివాహం చేసుకున్నారు. ఆమె నిర్ణయానికి తండ్రి డొనాల్డ్ ట్రంప్ పూర్తి మద్దతు పలికారు. ప్రస్తుతం ఇవాంకా దంపతులకు ఓ కుమార్తె.. ఇద్దరు కుమారులున్నారు. 
 
ఇదిలా ఉంటే, హైదరాబాదులో ఇవాంకా పర్యటించనున్న వేళ.. ఆమె డ్రెస్ కోడ్‌పై కూడా చర్చ సాగుతోంది. ఇవాంకా కోసం పోచంపల్లి పట్టుచీర రెడీ అవుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చే విందులో ఇవాంకా చీరకట్టుతో హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గోల్కొండ సందర్శనకు మాత్రం ఇవాంకా మోడ్రన్ డ్రెస్‌తో వెళ్తారని సమాచారం. 
 
ఇటీవల జపాన్‌లో జరిగిన వరల్డ్ అసెంబ్లీ ఆఫ్ విమెన్ (వావ్) సదస్సులో ఇవాంకా జపాన్ సంప్రదాయ దుస్తులు ధరించారు. విదేశీ పర్యటనల సమయంలో ఆమె అక్కడి సంప్రదాయ దుస్తులు ధరించడం అదే తొలిసారి. ఈ నేపథ్యంలో భారత్ పర్యటనలోనూ ఇవాంకా మన సంప్రదాయ దుస్తులను ధరిస్తారని తెలుస్తోంది. ఇందుకోసం తెలంగాణ సర్కారు ఇవాంకా కోసం పట్టుచీరను నేయిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments