Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డెంగ్యూతో బాలిక మృతి- బిల్లు మాత్రం రూ.18లక్షలు

డెంగ్యూ ఆస్పత్రిలో చేరిన బాలిక మృతి చెందింది. అయితే బిల్లు మాత్రం రూ.18లక్షలు పడింది. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ద్వారకకు చెందిన ఐటీ ఉద్యోగి జయంత్ సింగ్ డెంగ్యూ బ

డెంగ్యూతో బాలిక మృతి- బిల్లు మాత్రం రూ.18లక్షలు
, మంగళవారం, 21 నవంబరు 2017 (17:50 IST)
డెంగ్యూ ఆస్పత్రిలో చేరిన బాలిక మృతి చెందింది. అయితే బిల్లు మాత్రం రూ.18లక్షలు పడింది. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ద్వారకకు చెందిన ఐటీ ఉద్యోగి జయంత్ సింగ్ డెంగ్యూ బాధపడుతున్న తన ఏడేళ్ల కుమార్తె ఆద్యా సింగ్‌ను గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో చేర్చారు. 
 
రెండు వారాల పాటు ఆ చిన్నారి వైద్యులు చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించి ఆద్య కన్నుమూసింది. కానీ రెండు వారాలపాటు ఆమెకు అందించిన వైద్య సేవలకు గాను ఆసుపత్రి యాజమాన్యం ఏకంగా రూ. 18 లక్షల బిల్లు చేతికిచ్చింది. దీంతో బాలిక తల్లిదండ్రులు షాక్ తిన్నారు. అసలు బిడ్డను కోల్పోయిన బాధలో వున్న తల్లిదండ్రులకు ఆస్పత్రి బిల్లు మరో షాక్ ఇచ్చింది. 
 
ఆసుపత్రి బిల్లు చెల్లించేందుకు జయంత్ రూ.5లక్షలు పర్సనల్ లోన్ తీసుకున్నారు. కుటుంబ సభ్యులు, తెలిసినవారు, ఇతరుల నుంచి మరికొంత తీసుకున్నారు. అయితే అంత మొత్తాన్ని కట్టలేక నానా తంటాలు పడిన బాలిక తండ్రి ట్విట్టర్లో ఆ బిల్లుతో పాటు తన గోడును కూడా పోస్టు చేశఆడు. ఆసుపత్రి ఇచ్చిన బిల్లులో నర్సులు ఉపయోగించిన 2700 గ్లోవ్స్‌లు కూడా వున్నాయి. 
 
ఇక ఆస్పత్రిపై నెటిజన్లు విమర్శలు గుప్పించడంతో కేంద్రమంత్రి నడ్డా రంగంలోకి దిగారు. వివరాలు పంపాల్సిందిగా ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే తమపై వస్తున్న ఆరోపణలు, విమర్శలను ఫోర్టిస్ ఆసుపత్రి యాజమాన్యం మాత్రం ఖండించింది. అయిన ఖర్చుకే డబ్బు చెల్లించాల్సిందిగా బిల్లు పంపామని ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపి ప్రజలకు మోడీ బోడి కొట్టారు... ప్రకాష్‌ రాజ్