యువరాజ్‌పై గృహహింస కేసు? ఎఫ్ఐఆర్ నమోదు కాలేదంటున్న లాయర్
భారత క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై ఆయన మరదలు కేసు పెట్టినట్టు వచ్చిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో యూవీ తరపు న్యాయవాది రంగంలోకి దిగారు. యువరాజ్ సింగ్‌పై ఎలాంటి కేసు పెట్టలేదనీ, కేవలం భర్త, అ
భారత క్రికెటర్ యువరాజ్ సింగ్‌పై ఆయన మరదలు కేసు పెట్టినట్టు వచ్చిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో యూవీ తరపు న్యాయవాది రంగంలోకి దిగారు. యువరాజ్ సింగ్‌పై ఎలాంటి కేసు పెట్టలేదనీ, కేవలం భర్త, అత్తలపైనే కేసు పెట్టిందని వివరణ ఇచ్చారు.
టీమిండియా దిగ్గజ ఆటగాడు యువరాజ్ సింగ్, అతడి కుటుంబ సభ్యులపై యువీ తమ్ముడు జొరావర్ సింగ్ భార్య ఆకాంక్ష శర్మ కేసుపెట్టిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీంతో యువీ లాయర్ దమన్ బీర్ సింగ్ రంగంలోకి దిగి వివరణ ఇచ్చారు. యువరాజ్ సింగ్ మరదలు ఆకాంక్ష శర్మ తన భర్త, అత్తలపై మాత్రమే గృహహింస కేసు పెట్టిందన్నారు. యువీపై ఆకాంక్ష ఎలాంటి కేసు పెట్టలేదని స్పష్టం చేశారు. ఈ విషయం గురుగ్రామ్ పోలీసులను అడిగి తెలుసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ కేసులో తొలి విచారణ ఈ నెల 21న జరగనుంది.