రేప్ చేసేటపుడు నువ్వు ఏడ్చావా.. గట్టిగా కేకలు వేస్తూ గోళ్లతో రక్కావా?
లైంగిక దాడి జరిగిన బాధితుల వద్ద న్యాయవాదులు అమానవీయ ప్రశ్నలు అడుగుతున్నట్టు ఓ స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా.. లైంగికదాడి జరుగుతున్నప్పుడు నువ్వు ఏడ్చావా?, గట్టిగా కేకలు వేసి, ఎవరినైనా పిల
లైంగిక దాడి జరిగిన బాధితుల వద్ద న్యాయవాదులు అమానవీయ ప్రశ్నలు అడుగుతున్నట్టు ఓ స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా.. లైంగికదాడి జరుగుతున్నప్పుడు నువ్వు ఏడ్చావా?, గట్టిగా కేకలు వేసి, ఎవరినైనా పిలిచేందుకు ప్రయత్నించావా?, నీపై లైంగిక దాడి జరుపుతున్న వ్యక్తిని నీ గోళ్లతో రక్కేందుకు ప్రయత్నించావా? వంటి ప్రశ్నలను నిందితుల తరపు న్యాయవాదులు న్యాయస్థానాలలో లైంగికదాడి బాధితులను అడుగుతున్నారని పార్ట్‌నర్స్ ఫర్ లా ఇన్ డెవలప్‌మెంట్ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది.
పైగా, కోర్టు గదుల్లోనే సాక్షులను బెదిరిస్తున్నారని, భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు తమ అధ్యయనంలో తేలిందని పేర్కొంది. నేర శిక్షా స్మృతి సవరణలు 2013 తర్వాత సంస్కరణలు అమలు జరుగుతున్న తీరుపై ఆ సంస్థ అధ్యయనం నిర్వహించింది.
ఢిల్లీలోని నాలుగు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో విచారణ జరుగుతున్న 16 లైంగికదాడి కేసులను ఆ సంస్థ అధ్యయనం చేసినట్టు తెలిపింది. విచారణ సమయంలో బాధితులను న్యాయవాదులు అమానవీయ ప్రశ్నలు అడుగటంపై క్రిమినల్ లాయర్ రెబెకా జాన్ మాట్లాడుతూ, అటువంటి వ్యాఖ్యలు అసాధారణమేమీ కాదని చెప్పారు.