Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీసాల మోనాలిసా.. రూ.5 కోట్లకు అమ్ముడు పోయింది...

'మీసాల మోనాలిసా' రూ.5 కోట్లకు అమ్ముడుపోయింది. మోనాలిసా ఏంటి అమ్ముడు పోవడం ఏంటనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డావెన్సీ అద్భుతంగా మలిచిన చిత్రం ‘మోనాలిసా’. ఫ్రెంచ్‌

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (07:53 IST)
'మీసాల మోనాలిసా' రూ.5 కోట్లకు అమ్ముడుపోయింది. మోనాలిసా ఏంటి అమ్ముడు పోవడం ఏంటనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డావెన్సీ అద్భుతంగా మలిచిన చిత్రం ‘మోనాలిసా’. ఫ్రెంచ్‌-అమెరికన్‌ పెయింటర్‌ మార్సెల్‌ డచాప్‌ ‘మోనాలిసా’ చిత్రపటాన్ని తొమ్మిది రకాలుగా పెయింటింగ్‌ వేశాడు. 
 
అందులో ఒక చిత్రం 7.50 లక్షల డాలర్లకు (సుమారుగా రూ.5 కోట్లు) అమ్ముడైంది. ఈ చిత్రంలో మోనాలిసాకు గడ్డం, మీసం ఉండటం గమనార్హం. ఇటువంటి ఆసక్తికరమైన 110 చిత్రాలను కలిగిన అమెరికన్‌ రచయిత బ్రాండిట్‌ వాటిని అమ్మడం ద్వారా 46 లక్షల డాలర్లు (రూ.30 కోట్లు) రాబట్టేందుకు గత శనివారం వేలం పాటల కార్యక్రమం నిర్వహించాడు. 
 
చిత్రకారుడు ఫ్రాన్సిస్‌ పికాబియా సృష్టించిన చిత్రానికి 8.22 లక్షల డాలర్లు వస్తాయని భావించగా, ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు. వ్యూహాత్మక చిత్రాల పితామహుడిగా గుర్తింపు పొందిన డచాప్‌ వేసిన మోనాలిసా చిత్రానికి 4.70 లక్షల డాలర్లు నుంచి 7 లక్షల డాలర్ల వరకు ధర పలుకుతుందని అంచనా వేయగా.. దానిని మించి 7.50 లక్షల డాలర్ల రేటుకు అమ్ముడు పోయి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments