Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్నాల్డ్‌ను కాలితో తన్నిన దుండగుడు...

Webdunia
ఆదివారం, 19 మే 2019 (13:46 IST)
ప్రముఖ హాలీవుడ్ నటుడు, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌ను ఓ దుండగుడు ఇటీవల కాలితో తన్నాడు. ఈయన వయసు 71 యేళ్లు. ఈ సంఘటన సౌతాఫ్రికాలోని జోహెన్స్‌బర్గ్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇటీవల ఆర్నాల్డ్ ద‌క్షిణాఫ్రికాలోని జోహెన్స్‌బ‌ర్గ్‌లో జ‌రిగిన క్లాసిక్ ఆఫ్రికా అనే కార్యక్ర‌మానికి హాజరయ్యారు. ఈ క్ర‌మంలో అభిమానుల‌తో పాటు ప్లేయ‌ర్స్‌తో స‌ర‌దాగా సంభాషిస్తూ ఆర్నాల్డ్ స్నాప్ చాట్ వీడియో తీస్తున్నాడు. ఇంత‌లో ఓ అజ్ఞాత‌వ్య‌క్తి వెన‌క నుండి ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చి ఆర్నాల్డ్‌ని త‌న్ని అత‌నే కింద ప‌డ్డాడు. అయితే వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది ఆ వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. 
 
అయితే తాను తీసిన స్నాప్ చాట్ వీడియోని ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన ఆర్నాల్డ్ ఈ విష‌యం గురించి పెద్ద‌గా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం సహజమేనంటూ తన హుందాతనాన్ని చాటుకున్నాడు. 
 
పైగా, "నన్ను ఎవ‌రో త‌న్నార‌ని వీడియో చూస్తే కాని తెలియ‌దు. ఆ ఇడియ‌ట్ నా స్నాప్ చాట్ వీడియోని నాశ‌నం చేయ‌నందుకు సంతోషం. మీరంద‌రు నాకు ఓ సాయం చేయాలి. ఒక వేళ మీరు ఈ వీడియోని షేర్ చేయాల‌నుకుంటే ఆ వ్య‌క్తి అరుపులు వినిపించ‌కుండా ఉన్న వీడియోని చేయండి. ఆ వ్య‌క్తి అస్స‌లు పాపుల‌ర్ కాకూడ‌దు. దక్షిణాఫ్రికాలోని ఆర్నాల్డ్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో 90 రకాల క్రీడలు ఉన్నాయి. 24 వేల అథ్లెట్లు ఉన్నారు. ఈ వీడియో ద్వారా వారికి పాపులారిటీ దక్కేలా చేద్దాం" అని ఆర్నాల్డ్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments