Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మనస్సున్న మారాజు.. మాట నిలబెట్టుకున్నాడు...

మనస్సున్న మారాజు.. మాట నిలబెట్టుకున్నాడు...
, ఆదివారం, 19 మే 2019 (13:38 IST)
మల్టీ టాలెంటెడ్ హీరో రాఘవ లారెన్స్. నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ఇలా వివిధ శాఖల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. పైగా తనకు అత్యంత ఇష్టమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఇతర హీలోకు ఓ మోడల్‌గా ఉన్నారు. ముఖ్యంగా, అనాథ పిల్లలను ఆదుకోవడంలో, ఉచిత ఆపరేషన్లు చేయించడంలో, పెద్దలకు నిలువనీడ కల్పించడంలో లారెన్స్ తర్వాతే ఎవరైనా. 
 
గతేడాది నవంబర్ నెలలో గజా తుపాను తమిళనాడు, కేరళను వణికించింది. భీకరమైన గాలులు, భారీ వర్షాలతో చాలా ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ క్రమంలో కేరళలోని ఓ పెద్దావిడ ఇల్లు కూడా కూలిపోయింది. దీంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. ఆమెను చూసిన కొందరు చలించిపోయి.. విషయాన్ని రాఘవ లారెన్స్ దృష్టికి తీసుకెళ్లారు. 
 
అంతే ఆమెలో తన అమ్మను చూసిన రాఘవ లారెన్స్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆమెకు ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. అన్నట్లుగానే పెద్దావిడకు సొంత నిధులతో ఇంటిని నిర్మించి ఇచ్చారు. పూజలు నిర్వహించిన అనంతరం వృద్దురాలితో కలిసి గృహప్రవేశం చేశారు. ఈ విషయాన్ని లారెన్స్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ సమస్యను తన దృష్టికి తీసుకొచ్చిన యువకులకు ధన్యవాదాలు తెలిపారు.
 
కాగా, గత యేడాది సంభవించిన గజ తుఫాను కారణంగా తమిళనాడులో సుమారు ఏడు జిల్లాల్లో ప్రాణనష్టంతోపాటు పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం సంభవించింది. ఎంద‌రో నిరాశ్ర‌యిల‌య్యారు. ఓ వృద్ద మ‌హిళకి కూడు, గుడ్డ‌, నీడ లేకుండా పోయింది. కొంద‌రు ప్ర‌జ‌లు ఆ ముస‌లావిడని ఆదుకోమ‌ని ప్రార్థించారు. ఈ విష‌యం లారెన్స్ దృష్టికి రావ‌డంతో స్పందించి నాడు ఇచ్చిన తన మాటను నిలబెట్టుకున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"మహిళా కబడ్డీ" మూవీ పోస్టర్ లాంచ్...