Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్తాన్‌ను కలిపి అఖండ భారత్ ఏర్పాటు చేయాలి : ఇస్లామాబాద్‌లో ఫ్లెక్సీలు

Webdunia
బుధవారం, 7 ఆగస్టు 2019 (17:01 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని ప్రధాని మోడీ సర్కారు రద్దు చేసింది. దీంతో పాకిస్థాన్ అంతటా ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అదేసమయంలో ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా భారత్ అనుకూల ఫ్లెక్లీలు కూడా కనిపించాయి. పాకిస్తాన్‌తో కలుపుకుని అఖండ భారత్‌ను ఏర్పాటు చేయాలన్నది ఆ ఫ్లెక్సీలోని ప్రధాన సారాంశంగా ఉంది. దీంతో అప్రమత్తమైన పాక్ పోలీసులు ఆ ఫ్లెక్సీలను చింపివేశారు. 
 
జమ్మూకాశ్మీర్ విషయంలో భారత చర్యలను పాకిస్థాన్‌లోని కొంతమంది గట్టిగా సమర్థిస్తున్నారు. వీటిని రుజువు చేసేలా భారత్‌కు అనుకూలంగా ఫ్లెక్సీలు దర్శనమివ్వడం సంచలనం రేకెత్తించింది. ఇస్లామాబాద్‌లోని ప్రెస్ క్లబ్, సెక్టార్ ఎఫ్-6, అబ్ పారా చౌక్ ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలు కనిపించాయి. 'మహాభారత్ దిశగా ముందడుగు' అని బ్యానర్లో పేర్కొన్నారు. 
 
అంతేకాదు, అఖండ భారత్ లక్ష్యాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి చేయాలంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను బ్యానర్‌పై ప్రింట్ చేశారు. ఈ బ్యానర్లను స్థానికులు చాలా సేపు ఆసక్తికరంగా చూశారు. ఆ తర్వాత కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో... వారు వచ్చి ఫ్లెక్సీలను తొలగించారు. ఈ విషయాన్ని పాకిస్థాన్‌లోని ప్రముఖ పత్రిక డాన్ ప్రచురించింది. మరోవైపు, దీనికి సంబంధించి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫెస్టివల్స్ అనంతరం థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక మూవీ ఫియర్

ఏఆర్.రెహ్మాన్ తండ్రిలాంటివారు... ఆ సంబంధం అంటగట్టొద్దు ప్లీజ్ : మోహిని డే

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments