టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నానిని లక్ష్యంగా చేసుకుని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్. విష్ణువర్ధన్ ఘాటైన విమర్శలు చేశారు. ఇదే అంశంపై ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
* కేశినేని నాని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుడు. వాళ్ల పార్టీ పార్లమెంటులో దేశ ప్రజల అభిప్రాయానికి అణుగుణంగా అందరితో కలిసి ఆర్టికల్ 370 బిల్లుకు మద్దతు ఇచ్చింది. మరి ఈయనగారి, మానసిక స్థితి సరిగా లేదా! లేక ఆయనకి తన పార్టీ మీద కోపమా? చితికిపోయిన ఆర్థిక కారణాలతో ఈ రకంగా తయారయ్యారా! తెలియదు.
ఖచ్చితంగా ఈయనకి మానసిక చికిత్స చేయాల్సిన అవసరం ఉంది.
* లేదా మీడియాలో రోజు చిల్లర ప్రచారం కోసం సామాజిక మాద్యమాల ద్వారా సంచలన ప్రకటనలు చేస్తుంటే వారి పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం అనేది తెలుగుదేశం పార్టీ కేశినేని నాని ఇద్దరు తేల్చుకోవలసిన విషయం.
* ఒక ప్రముఖ వ్యాపార వ్యక్తి (వస్తువుగా)గా రాజకీయాల్లోకి వచ్చి రూ.కోట్లు పెట్టుబడి పెట్టి రాజకీయాల్లోకి వస్తే భారతదేశ చరిత్ర సరిగా తెలియదు కాబట్టి కేశినేని నాని గారు?
* జమ్ము కాశ్మీరులో 70 సంవత్సరాల పరిస్థితులు నీకు పత్రికల ద్వారా తెలిసిన షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా, అదేవిధంగా కేశినేని అబ్దుల్లా మీరు అనుకున్నదే కరెక్ట్ అనే భావంలో ఉన్నారు. కొంచెం చరిత్ర చదువుకోండి.
* కమ్యూనిస్టులు ఈ దేశ ద్రోహులనే భావన ప్రజలలో ఉంది. వారి దృష్టిలో ఇలాగే నిలిచిపోతారా? కనీసం తప్పు తెలుసుకొని ఈ దేశంలో ఉన్నారు కాబట్టి చైనా పాకిస్థాన్ ఏజెంట్ కాకుండా దేశ పౌరులుగా ఉంటామని క్షమాపణ చెప్పుతారా అంటూ నిలదీశారు.