Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంధకారంలో పాకిస్థాన్.. కారణం ఏంటో తెలుసా?

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (12:21 IST)
పాకిస్థాన్‌లో గాఢాంధకారం నెలకొంది. ప్రధాన పవర్ గ్రిడ్ ఫెయిల్యూల్ కావడంతో ఈ పరిస్థితి నెలకొందని ఆ దేశ విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ కారణంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ నగరాలు కూడా పూర్తిగా అంధకారంలో నెలకొన్నాయి. అలాగే బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని 22 జిల్లాల్లో అంధకారం నెలకొంది. నేషనల్ పవర్ గ్రిడ్ నుంచి ఫ్రీక్వెన్సీ పడిపోవడంతో పవర్ గ్రిడ్ బ్రేక్ డౌన్ అయిందని చెప్పారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ ట్వీట్ చేసింది. 
 
దేశంలోని పలు విద్యుత్ పంపిణీ సంస్థలు అంతకుముందు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన విషయాన్ని ధృవీకరించాయని పాకిస్థాన్ అధికారిక టీవీ చానెల్ జియో టీవీ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. గుడ్డు, క్వెట్టా నగరాల మధ్య విద్యుత్ సరఫరా చేసే రెండు లైన్లు ట్రిప్ అయ్యాయని దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని క్వెట్టా ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ వెల్లడించింది.
 
బలూచిస్థాన్‌లోని 22 జిల్లాలకు విద్యుత్ సరఫరా ఆగిపోయిందని, లాహోర్, కరాచీలోని పలు ప్రాంతాల్లోనూ చీకట్లు అలుముకున్నాయని అధికారులు వెల్లడించాయి. ఇస్లామాబాద్‌లోని 117 పవర్ గ్రిడ్ స్టేషన్లతో పాటు పెషావర్‌లోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments