భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాకిస్థాన్ దాయాదుల సంబంధాలను కలిగివున్న భావన కలగలేదని పాక్ మంత్రి హీనా రబ్బానీ అన్నారు. అయితే భారత మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్ పేయిలను దాయాదులుగా చూశామని, కానీ ప్రస్తుత ప్రధాని మోడీని తాము దాయాదిగా చూడటం లేదని హీనా రబ్బానీ అన్నారు.
తాను విదేశాంగ మంత్రిగా భారత్‌లో పర్యటించినప్పుడు మెరుగైన సహకారానికి పెద్దపీట వేశానని, 2023తో పోలిస్తే తాము మెరుగైన స్థితిలో ఉన్నామని హీనా పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో తమకు ఎలాంటి సమస్య లేదని తాను చెప్పడం లేదని, అయితే కొత్త చట్టాలు, ప్రస్తుతం ఉన్న చట్టాలను అమలు చేయడం ద్వారా మైనారిటీలకు రక్షణ కల్పించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
భారత్ ప్రధాని నరేంద్రమోదీ సొంత దేశానికి మంచే కావచ్చు.. కానీ ఆయన్ని పాకిస్థాన్ భాగస్వామిగా చూడటం లేదన్నారు. ప్రతి విషయాన్ని ఎన్నికల కోణంలో చూడవద్దన్నారు. శాంతిని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. గతంలో అన్ని మతాల వారు సామరస్యంగా భారత్‌లో సహజీవనం చేసేవారని.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు.