Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రెండో టీకాను వేసుకున్న అమెరికా ఎలెక్ట్ ప్రెసిడెంట్ బైడెన్

Webdunia
మంగళవారం, 12 జనవరి 2021 (08:41 IST)
అమెరికా 46వ అధ్యక్షుడుగా జో బైడెన్ ఎన్నికయ్యారు. ఆయన ఈ నెల 20వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కరోనా రెండో టీకాను వేయించుకున్నారు. గత నెల 21న తొలి డోసు తీసుకున్న బైడెన్ తాజాగా రెండో డోసు కూడా తీసుకున్నారు. 
 
ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, రెండో డోసు తీసుకుంటున్న సందర్భంలో కొంత ఒత్తిడికి గురైనట్టు చెప్పారు. దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందించడమే తన ప్రధాన కర్తవ్యమని బైడెన్ పేర్కొన్నారు. 
 
తాను కరోనా వ్యాక్సిన్ తీసుకున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన బైడెన్.. వ్యాక్సిన్ చాలా సురక్షితమని ఆయన పేర్కొన్నారు. వైరస్‌ పీచమణచేందుకు ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.
 
కరోనా టీకాపై ప్రజల్లో ఉన్న అనుమానాలను పోగొట్టేందుకు 78 ఏళ్ల బైడెన్ గత నెలలో బహిరంగంగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆమెరికా టీవీ చానళ్లు దీనిని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. తొలి డోసు వేయించుకున్న తర్వాత రెండో డోసు తప్పనిసరి కావడంతో తాజాగా అది కూడా తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments