Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయులకు అమెరికా శుభవార్త.. ఆ వీసాలో మార్పులు

సెల్వి
బుధవారం, 18 డిశెంబరు 2024 (13:54 IST)
భారతీయులకు అమెరికా శుభవార్త చెప్పింది. ఎఫ్-1 స్టూడెంట్ వీసాలను హెచ్-1బీ వీసాలుగా మార్చుకునే అవకాశం కల్పించింది. ఫలితంగా లక్షలాదిమంది భారతీయ ప్రొఫెషనల్స్‌కు ప్రయోజనం చేకూరనుంది. 
 
అమెరికాలోని ఐటీ కంపెనీలు హెచ్-1బీ వీసా (నాన్ ఇమిగ్రెంట్) సాయంతో విదేశీ నిపుణులను నియమించుకుంటాయి. తాజా మార్పులతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను నియమించుకునే అవకాశం యజమానులకు లభిస్తుందని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెంజాడ్రో ఎన్ మేయోర్కాస్ తెలిపారు. 
 
ఈ వీసా ద్వారా భారత్, చైనా దేశాలు భారీగా లబ్ధి పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ నిబంధనల్లో మార్పులు చేసి అవసరాలకు తగ్గట్టుగా విదేశీ ఉద్యోగులను నియమించుకునే అవకాశాన్ని అక్కడి కంపెనీలకు కల్పించింది. 
 
ఈ కొత్త విధానంలో లేబర్ కండిషన్ అప్లికేషన్ కచ్చితంగా హెచ్-1బీ వీసా పిటిషన్‌కు అనుగుణంగా ఉండాలి. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రాజమౌళి, మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ తెలిపిన రామ్ చరణ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments