Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మండుతున్న మణిపూర్‌.. మరింతగా క్షీణించిన శాంతిభద్రతుల... అదనపు బలగాలు..

manipur roits

ఠాగూర్

, మంగళవారం, 19 నవంబరు 2024 (09:38 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ మళ్లీ మండిపోతుంది. దీంతో గత కొన్ని రోజులుగా ఇక్కడ శాంతిభద్రతలు క్షీణించిపోతున్నాయి. వీటిని అదుపు చేయడం స్థానిక పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. ఇప్పటికే కేంద్ర బలంగాలను కూడా రంగంలోకి దించింది. అయినప్పటికీ పరిస్థితులు ఏమాత్రం అదుపులోకి రావడం లేదు. దీంతో అదనంగా మరో 50 కంపెనీల సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ బలంగాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే, సాయుధ బలగాలు జరిపిన కాల్పుల్లో ఒక ఆందోళనకారుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
కర్వ్యూను ఉల్లంఘించిన ఆందోళనకారులు యథేచ్చగా అల్లర్లకు పాల్పడ్డారు. జెరిజమ్ జిల్లాలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లల హత్యకు నిరసనగా కొకొమీ(కోఆర్డినేషన్ కమిటీ ఆన్ మణిపూర్ ఇంటిగ్రిటీ) గ్రూపునకు చెందిన కొందరి నేతృత్వంలో జనం ఇంపాల్ పశ్చిమ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు.
 
జిరిబమ్ జిల్లాలో హత్యకు గురైన బాధితులకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ నిరసనకారులు ఇంపాల్లోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయంలోకి చొచ్చుకుపోయి ప్రధాన గేటుకు తాళం వేశారు. సమీపంలోని పలు కార్యాలయాలకు ఇదేవిధంగా తాళాలు వేశారు. అలాగే కుకి మిలిటెంట్లపై సైనిక చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇంపాల్‌లో కొకొమి చేపట్టిన ధర్నా మూడోరోజుకు చేరుకుంది. 
 
మరోవైపు మణిపూర్ ప్రభుత్వం సోమవారం నుంచి బుధవారం వరకు ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ వరుసగా రెండోరోజు మణిపూర్‌ పరిస్థితులపై కేంద్ర, ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. మరో 5 వేలమంది పారామిలిటరీ సిబ్బందిని ఆ రాష్ట్రానికి పంపాలని నిర్ణయించారు. ఉన్నతాధికారులు ఆ రాష్ట్రంపై దృష్టిపెట్టి వెంటనే అక్కడ శాంతిభద్రతలను పునరుద్ధరించాలని ఆదేశించారు. 
 
ఇప్పటికే సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఏడీ సింగ్, ఇతర కేంద్ర సాయుధ పోలీసు బలగాల ఉన్నతాధికారులు ఆ రాష్ట్రంలో మకాం వేసి ఉన్నారు. గతవారం పంపిన కేంద్ర సిబ్బందితో కలిపి మొత్తం 218 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఆ రాష్ట్రంలో ఉన్నాయి. కాగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మణిపూర్‌లో తాజాగా చోటు చేసుకున్న హింసకు సంబంధించి మూడు కేసులను నమోదు చేసింది. 
 
మరోవైపు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభంకాక ముందే ప్రధాని నరేంద్ర మోడీ కల్లోలిత మణిపూర్ రాష్ట్రంలో పర్యటించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మణిపూర్‌లో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ పూర్తిగా విఫలమైందని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేయాలని కోరింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి ఆలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ దర్శనం ఇక 2 గంటలే!