Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర కొరియా దూకుడుకు కళ్లెం వేస్తాం : షింజో అబే

ఉత్తర కొరియా దూకుడుకు కళ్లెం వేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని జపాన్ ప్రధానమంత్రి షింజో అబే వెల్లడించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని పార్టీ విజయకేతనం ఎగురవేసింది.

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (10:35 IST)
ఉత్తర కొరియా దూకుడుకు కళ్లెం వేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని జపాన్ ప్రధానమంత్రి షింజో అబే వెల్లడించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని పార్టీ విజయకేతనం ఎగురవేసింది. దీంతో ఆయన మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉత్తర కొరియా దూకుడును నియంత్రించేందుకు తగిన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. 
 
వచ్చే నెలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జపాన్‌లో పర్యటించనున్నారు. అయితే అప్పుడు నార్త్ కొరియా అంశాన్ని ట్రంప్‌తో చర్చించనున్నట్లు అబే తెలిపారు. రష్యా, చైనాలతోనూ ఈ అంశాన్ని ప్రస్తావించనున్నట్లు ఆయన తెలిపారు. పదేపదే అణుపరీక్షలతో బెంబేలెత్తిస్తున్న నార్త్ కొరియాపై బలమైన ఒత్తిడి తీసుకురానున్నట్లు అబే చెప్పారు. 
 
జపాన్ ప్రజల రక్షణను తాను కోరుతున్నట్లు ఆయన తెలిపారు. అబేకు చెందిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీపీ).. కొమిటో పార్టీతో కలిసి.. దిగువసభకు మొత్తం 465 స్థానాలకుగాను 313 స్థానాలను గెలుచుకున్నది. ఈ మెజారిటీతో రాజ్యాంగాన్ని సవరించేందుకు అబే సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments