Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్ భూకంపం: 155 కంపించిన భూకంపం.. 24 మంది మృతి

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (13:43 IST)
జపాన్‌ను వరుస భూకంపాలు వణికించాయి. ఒక్క రోజులో భూమి 155 సార్లు కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. దీంతో రోడ్లు ధ్వంసమై పలు ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు కూలిపోయాయి. 
 
శిథిలాల కింద చిక్కుకుని ఇప్పటి వరకు 24 మంది మృతి చెందినట్లు జపాన్ ప్రభుత్వం వెల్లడించింది. కూలిన నిర్మాణాల కింద మరికొంత మంది చిక్కుకుపోయి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రధాని ఫుమియో కిషిడా ఆందోళన వ్యక్తం చేశారు.
 
ఆర్మీ సిబ్బందిని, అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టామని ప్రధాని తెలిపారు. ప్రాణనష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. సముద్రంలో అలలు ఎగసిపడుతుండటంతో తీరప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చెబుతున్నారు. 
 
కాగా, భూకంప తీవ్రతకు మెట్రో స్టేషన్ కంపించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. అంతే కాకుండా భూకంపానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments