గ్రేటర్ నోయిడాలో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం..

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (13:40 IST)
దేశ రాజధాని నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్.సి.ఆర్) పరిధిలోని గ్రేటర్ నోయిడా పరిధిలో ఓ దారుణం జరిగింది. ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ బాధితురాలిపై గతంలో అఘాయిత్యం జరిగింది. ఈ నెల 30వ తేదీన మరోమారు మహిళకు ఫోన్ చేసి బ్లాక్‌మెయిలింగ్ చేసి ఈ దారుణానికి పాల్పడ్డారు. దీనిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు కామాంధులను అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
గ్రేటర్ నోయిడాలోని ఓ షాపింగ్ మాల్‌ సమీపంలో 26 యేళ్ళ మహిళపై సామూహిక లైంగికదాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటివరుక ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశఆరు. మరో ఇద్దరు పరారీలో ఉండగా, ఒకరు స్థానికంగా బలమైన వ్యక్తి అని పోలీసుల విచారణలో గుర్తించారు. ఈ అత్యాచార ఘటన గతంలో జరిగింది. ఇపుడు ఈ మళ్లీ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూ వేధించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... రాజ్ కుమార్, ఆజాద్, వికాస్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. రవి, మేహ్మి అనే మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు సమాచారం. వీరిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. అరెస్టు అయిన నిందితులను కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments