ఫరిదాబాద్ ఉగ్ర నెట్‌వర్క్‌లో ఉన్నత విద్యావంతులే కీలక భాగస్వాములు...

ఠాగూర్
ఆదివారం, 23 నవంబరు 2025 (11:38 IST)
ఇటీవల ఫరీదాబాద్‌లో వెలుగు చూసిన ఉగ్రనెట్‌వర్క్‌లో భాగస్వాములుగా ఉన్నవరాంతా ఉన్నత విద్యా వంతులేని దర్యాప్తు సంస్థలు నిగ్గు తేల్చాయి. ఈ నెట్‌వర్క్‌‍లో డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ షహీన్, డాక్టర్ అదీల్ వంటి ఎంతో మంది వైద్యులు, ఇతర ఉన్నత విద్యావంతులు ఉన్నట్టు గుర్తించారు. వీరంతా కలిసి సమిష్టగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను సేకరించే నెట్‌వర్క్‌ను నడిపినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. 
 
విచారణలో భాగంగా నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ రూ.5 లక్షలు పెట్టి ఒక రష్యన్ అసాల్ట్ రైఫిల్‌ను కొనుగోలు చేసినట్లు తేలింది. ఈ ఆయుధాన్ని సహ నిందితురాలైన డాక్టర్ షహీన్‌కు సంబంధించిన వ్యక్తి ద్వారా సమకూర్చుకున్నాడు. అనంతరం దాన్ని డాక్టర్ అదీల్ లాకరులో భద్రంగా దాచిపెట్టగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదికాకుండా, మరో రష్యన్ ఏకే క్రింకోవ్ రైఫిల్, ఒక చైనీస్ స్టార్ పిస్టల్, బెరెట్టా పిస్టల్‌తో పాటు సుమారు 2,900 కేజీల పేలుడు పదార్థాలను కూడా అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు.
 
లక్నోకు చెందిన డాక్టర్ షహీన్ ఈ కుట్రలో కీలక పాత్ర పోషించినట్లు అధికారులు తెలిపారు. ఆమె రైఫిళ్లు, పేలుడు రసాయనాలను నిల్వ చేసేందుకు ఒక డీప్ ఫ్రీజర్‌ను ఏర్పాటు చేసింది. ఈ మాడ్యూల్ కోసం మొత్తం రూ.26 లక్షల నిధులు సేకరించగా, అందులో ఎక్కువ భాగం షహీన్ ద్వారానే సమకూరినట్లు తేలింది. పుల్వామా దాడి సూత్రధారి, జైషే చీఫ్ మసూద్ అజార్ మేనల్లుడైన ఉమర్ ఫరూక్ భార్య అఫిరా బీబీతో షహీన్‌కు సంబంధాలు ఉండవచ్చని ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యోగి ఆదిత్యనాథ్‌ కు అఖండ త్రిశూల్‌ ని బహూకరించిన నందమూరి బాలకృష్ణ

Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments