Webdunia - Bharat's app for daily news and videos

Install App

18వేల అడుగుల ఎత్తులో పుట్టిన బిడ్డ.. పేరెంటో తెలుసా..? ''స్కై''!

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (17:18 IST)
క్రిస్టెల్ హిక్స్ అనే మహిళ అలస్కా రాష్ట్రంలోని ఆంకరేజ్ పట్టణంలో నివసిస్తున్నారు. ఆమె 35 వారాల గర్భవతి. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ఆమె.. ఈ నెల 5న విమానంలో బయల్దేరారు. విమానం దాదాపు 18వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు.. ఆమెకు అకస్మాత్తుగా పురిటినొప్పులొచ్చాయి. ఈ క్రమంలో క్రిస్టెల్ హిక్స్ ఓ పండంటి బాబుకు జన్మనిచ్చారు. 
 
కాగా.. క్రిస్టెల్ హిక్స్ 18వేల అడుగుల ఎత్తులో తన కుమాడికి జన్మనివ్వడం.. అది ఆ బుడ్డోడికి మొదటి ప్రయాణం కావడంతో ఆమె తన కొడుకుకు ప్రత్యేకమైన పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో క్రిస్టెల్ హిక్స్ తన కుమారుడికి 'స్కై'గా నామకరణం చేశారు. 
 
ఇక... క్రిస్టెల్ హిక్స్, స్కై ఎయిరాన్ హిక్స్ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉన్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. నెలలు నిండకముందే స్కై ఎయిరాన్ హిక్స్ జన్మించడంతో.. ఆ చిన్నోడిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం