Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మా.. మా నాన్న ఎవరు?.. కుమార్తె : కర్రుతో వాతలు పెట్టిన తల్లి!

Advertiesment
అమ్మా.. మా నాన్న ఎవరు?.. కుమార్తె : కర్రుతో వాతలు పెట్టిన తల్లి!
, గురువారం, 13 ఆగస్టు 2020 (09:00 IST)
అనంతపురం జిల్లా కదిరి మండలంలో ఓ తల్లి అత్యంత కిరాతకంగా ప్రవర్తించింది. ప్రియుడి మోజులో పడి ఈ దారుణానికి పాల్పడింది. అమ్మా.. మా నాన్న ఎవరు అని ప్రశ్నించింది. అంతే.. అట్లకాడను వేడి చేసి వాతలు పెట్టింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కదిరి పట్టణంలోని ఓ కాలనీకి చెందిన ఓ మహిళ... కుటుంబ కలహాల కారణంగా భర్తతో విడిపోయింది. అనంతరం మరొకర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పట్నుంచి ప్రియుడిపై మోజుతో తన మొదటి భర్తకు పుట్టిన కుమార్తెను చిత్ర హింసలకు గురిచేయసాగింది. 
 
ఈ క్రమంలో 'అమ్మా.. మా నాన్న ఎవరు..?' అని చిన్నారి ప్రశ్నించినందుకు తల్లి తీవ్ర ఆగ్రహానికి లోనైంది. దీంతో 'ఏంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్' అంటూ చిన్నారి ఒంటి నిండా ఆ కసాయి తల్లి వాతలు పెట్టింది. 
 
ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు చేరవేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే, ఆ చిన్నారిని ఐసీడీఎస్ అధికారులకు పోలీసులు అప్పగించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ముస్లిం యువకులు ఆంజనేయ స్వామి ఆలయాన్ని అలా కాపాడారు