Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెనడాకు ఇప్పట్లో విమానాలు లేనట్లే

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (11:02 IST)
భారత్ నుంచి నేరుగా వచ్చే విమానాలపై సెప్టెంబర్ 21 వరకు నిషేధం కొనసాగుతుందని తాజాగా ప్రకటించింది. ఇక కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్ 22న తొలిసారి భారత విమానాలపై కెనడా బ్యాన్ విధించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత బ్యాన్‌ను పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది. తాజాగా ఐదోసారి నిషేధాన్ని పొడిగించింది. అయితే, కార్గో, ఇతర అత్యావసర విమాన సర్వీసులకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది.

కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోలేదని, పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ సందర్భంగా కెనడా అధికారులు వెల్లడించారు.
 
సెప్టెంబర్ 21, రాత్రి 11.59 గంటల వరకు భారత్ నుంచి వచ్చే అన్ని కమర్షియల్, ప్రైవేట్ ప్యాసెంజర్ విమానాలపై బ్యాన్ కొనసాగుతుందని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.

కాగా, నేరుగా వచ్చే విమానాల ద్వారా కాకుండా ఇతర దేశాల గుండా కెనడా వచ్చే భారతీయులు తప్పనిసరిగా చెల్లుబాటయ్యే పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, యూఏఈ‌తో పాటు ఇతర కొన్ని దేశాలు భారత్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రయాణాలపై పలు సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments