Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హాంకాంగ్‌ లో భారత్‌ విమానాల రాకపోకలపై నిషేధం

Advertiesment
హాంకాంగ్‌ లో భారత్‌ విమానాల రాకపోకలపై నిషేధం
, సోమవారం, 19 ఏప్రియల్ 2021 (11:12 IST)
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. భారత్‌ నుండి వచ్చే విమానాలను నిలిపివేస్తున్నట్లు హాంకాంగ్‌ ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం నుండి మే 3 వరకు భారత్‌ విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు విమానా యాన శాఖ వర్గాలు తెలిపాయి.

భారత్‌తో పాటు పాకిస్తాన్‌, ఫిలిప్పీన్స్‌ నుండి వచ్చే విమానాలను కూడా నిలిపివేసినట్లు వెల్లడించారు. ఈ నెల ప్రారంభంలో ముంబయి, ఢిల్లీ నుండి వెళ్లిన రెండు విస్టారా విమానాల్లోని 50 మంది ప్రయాణికులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్థారణైందని.. దీంతో ప్రభుత్వం ఈ నిర్నయం తీసుకున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.

అలాగే హాంకాంగ్‌కు వచ్చే ఇతర దేశాల ప్రయాణికులు కూడా కరోనా నెగిటివ్‌ సర్టిఫికేట్‌ను కలిగి ఉండాలని తెలిపింది. కాగా, ఈ అంశంపై విస్టారాను ప్రశ్నించగా స్పందించలేదని మీడియా తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడు లక్షలకు చేరువలో కరోనా కేసులు