అంతర్జాతీయ విమాన రాకపోకలపై జూన్ 30 వరకు నిషేధం విధిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిసిజిఎ) శుక్రవారం సర్య్కూలర్ జారీ చేసింది. ఈ విమానాలపై పాక్షిక నిషేధాన్ని పొడిగిస్తూ జూన్ 26,2020 న జారీ చేసిన మునుపటి ఉత్తర్వును సవరించింది.
అయితే షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ విమానాలను ఎంపిక చేసిన మార్గాల్లో కేస్-టు-కేస్ ప్రాతిపదికన అనుమతించవచ్చునని డిసిజిఎ తెలిపింది. కోవిడ్ తొలి వేవ్ మొదలైన నాటి నుండి అంటే మార్చి 23,2020 నుండి భారత్ అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆంక్షలు విధించగా.. అదే ఏడాది మే నుండి వందే భారత్ మిషన్ కింద ప్రత్యేక అంతర్జాతీయ విమానాలను నడిపింంది.
జులై నుండి ఎంపిక చేసిన దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం 'ఎయిర్ బబుల్' కింద నడుస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, యుఎఇ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్‌తో పాటు 27 దేశాలతో ఈ ఒప్పందం చేసుకుంది. ఎయిర్‌బబుల్ ఒప్పందం ప్రకారం ఆయా దేశాలు...ప్రత్యేక విమానాలను వారి భూభాగాల మధ్య నడుపుతుంటాయి.