ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం: మైక్రోసాఫ్ట్ ఆఫీసు గేటు వద్ద ఇరాన్ క్షిపణి పేలుడు (video)

ఐవీఆర్
శుక్రవారం, 20 జూన్ 2025 (14:22 IST)
ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఎనిమిదవ రోజుకి చేరుకుంది. ఇరు దేశాలు పూర్తి శక్తిసామర్థ్యాలు చూపిస్తూ విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ వేసిన భారీ క్షిపణి ఒకటి ఇజ్రాయెల్ మైక్రోసాఫ్ట్ కార్యాలయం ముందు పడి భారీ విస్పోటనం సంభవించింది. అగ్నిమాపక దళం హుటాహుటిన రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే పనిలో పడ్డాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాలు రాత్రిపూట వరుస దాడులలో ఇరాన్ అంతటా పలు సైనిక లక్ష్యాలను ధ్వంసం చేశాయని తెలిపాయి. ఇరాన్ శుక్రవారం ఇజ్రాయెల్‌పై కొత్త క్షిపణుల దాడిని ప్రారంభించింది. నగరంలోని సోరోకా ఆసుపత్రిపై దాడి తర్వాత వరుసగా రెండవ రోజు బీర్షెబా నగరాన్ని తాకింది.
 
ఇరానియన్ క్షిపణులు దక్షిణ ఇజ్రాయెల్‌లోని అతిపెద్ద వైద్య కేంద్రమైన సోరోకా ఆసుపత్రిపై దాడి చేయడంతో సుమారు 240 మంది గాయపడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ దేశానికి భారీ నష్టం వాటిల్లుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్, ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇరాన్ దేశానికి తగిన బుద్ధి చెబుతామని అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments